ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఎంత శక్తివంతమైన వాగ్దానం! మునుపటి రెండు వాక్యాలలో అపొస్తలుడైన పౌలు చర్చిస్తున్నట్లు మనం యేసు నామంలో ఇతరులతో ఉదారంగా పంచుకునేందుకు సిద్ధంగా ఉంటే, మనకు అవసరమైనవి మనకు లభిస్తాయి మరియు మన జీవితాలు దేవునికి మహిమ తెచ్చే మంచి పనులతో నిండి ఉంటాయి. కాబట్టి మనం చిన్నపిల్లలుగా నేర్చుకోవలసిన మొదటి పాఠాలను గుర్తుకు తెచ్చుకుందాం అదేమంటే "పంచుకోవటము" ఈ సమయంలోనే , దేవుని పిల్లలుగా, ఇతరులను ఆశీర్వదించడానికి యేసు నామంలో వారిని భాగస్వామ్యులను చేద్దాం, తద్వారా వారు ఆయన కృపలోనికి వస్తారు.

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, మీరు నా జీవితంలో కురిపించిన అద్భుతమైన ఆశీర్వాదాలన్నిటికీ ధన్యవాదాలు. మీరు నన్ను శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా గొప్పగా ఆశీర్వదించారు. మీరు నాకు ఇంత గొప్పగా ఇచ్చిన బహుమతులతో ఉదారంగా ఉండటానికి మీ ఆత్మ నాకు సహాయం చేస్తుందని ఇప్పుడు నేను అడుగుతున్నాను. యెహోవా, నాయెడల మీ దయ మీ ఆశీర్వాదాలకు స్థిరమైన మార్గంగా ఉండనివ్వండి , తద్వారా ఇతరులు మీ దయను తెలుసుకుంటారు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు