ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవునితో మనకున్న సంబంధం యేసు చేసిన ప్రాయశ్చిత్త బలిపై మరియు విధేయతగల విశ్వాసం ద్వారా ఆ త్యాగాన్ని అంగీకరించడం మీద నిర్మించబడింది. ఆ విశ్వాసం దేవుడు వున్నాడు అని నమ్మకము కలిగించుటయే కాక, వ్యక్తిగతంగా ఆయన మనగురించి ఆలోచిస్తున్నాడు అని , ఆయనను తెలుసుకోవాలనే మన కోరికను కూడా పట్టించుకుంటుంన్నాడని నమ్మకము కలిగిస్తోంది. తనను వెతుకుతున్న వారిని ఆశీర్వదించాలని ఆయన ఆత్రంగా కోరుకుంటాడు. మనం ఆయనను వెతుకుతున్నప్పుడు మనం కనుగొన్నది ఏమిటంటే, మిగతా ఆశీర్వాదాలన్నీ తెలుసుకోవడంతో పోల్చితే, శాశ్వతమైన, అమరత్వం, మరియు నిజమైన దేవుడి ద్వారా తెలుసుకోవడం ముందు శూన్యం అని అర్ధం అవుతుంది.

నా ప్రార్థన

పరిశుద్ద దేవా, నేను నిన్ను బాగా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాను. దయచేసి నా జీవితములో మరియు మీ సంఘము యొక్క జీవితంలో మీ ఉనికిని మరింత శక్తివంతంగా తెలియజేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు