ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం కష్టాల్లో ఉన్నప్పుడు లేదా మనం వృద్ధులమైనప్పుడు దేవుడు మనల్ని మరచిపోడు. మనం మన స్నేహితుల కంటే ఎక్కువ కాలం జీవించవచ్చు మరియు మనకు తెలిసిన వారిచే మరచిపోబడవచ్చు , కానీ దేవుడు మనలను ఎప్పటికీ విడిచిపెట్టడు లేదా ఎడబాయడు . ఆయన మనలను ఆదుకుంటాడు, తీసుకువెళతాడు, రక్షిస్తాడు మరియు కాపాడుతాడు .

నా ప్రార్థన

నా తండ్రి, నన్ను ఎప్పటికీ మరచిపోనని వాగ్దానం చేసినందుకు ధన్యవాదాలు. పాత కాలపు మీ పిల్లలపట్ల మీ విశ్వాసం కారణంగా, నన్ను ఎప్పటికీ విడిచిపెట్టరనిన మీ వాగ్దానాన్ని నేను విశ్వసించగలనని నాకు తెలుసు. నేను ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్లినా మీరు నాతో పాటు వస్తారని నేను నమ్ముతున్నాను. యేసు నామంలో నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు