ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం వక్రబుద్ధి వీడి పరిశుద్ధులమైతే, మనం క్రీస్తుతో కూడా బాప్తిస్మములో చనిపోయి, పరిశుద్ధాత్మ ద్వారా మొత్తముగా మరియు పూర్తిగా పరిశుద్ధులమైనట్లైతే , మనం దేవుడి కోసం జీవిద్దాం! పాపం, మరియు పాపానికి మన చూపే ఇష్టం, మన శక్తితో ప్రతిఘటిద్దాం, మనం చేస్తున్నట్లుగా, మనం మన స్వంతంగా జీవించగలిగే దానికన్నా పవిత్రశక్తి మనల్ని చాలా గొప్ప నీతికి బలపరుస్తుంది. మన పాపపు గతానికి చనిపోయి, దేవుని పవిత్ర స్వభావం కోసం సజీవంగా ఉండాలని ప్రతిరోజును ఒక చేతన నిర్ణయంతో ప్రారంభిద్దాం!

నా ప్రార్థన

ప్రేమగల మరియు నీతిమంతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా , నా హృదయం మీ ఇష్టానికి కట్టుబడి ఉండటానికి మరియు మీ పవిత్ర స్వభావం మరియు దయకు పూర్తిగా అనుగుణంగా ఉండటానికి సహాయపడండి. యేసు, నా రక్షకుడు మరియు నా ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు