ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుని అద్భుతమైన దయయే మరియు కృప మన పరిశుద్ధతకు ప్రేరణ .యేసు త్యాగం ద్వారా ఆయన తన ప్రేమను ఇప్పటికే మనకు చూపించాడు కాబట్టి మనము మనలను అతనికి సమర్పించుకొనుచున్నాము . మనము అతనికి మన గౌరవమును అర్పించినప్పుడు, మనము ఆయనను ఆరాధిస్తున్నాము. మనము ప్రపంచ జీవనశైలిలోకి మలచబడటానికి నిరాకరించినప్పుడు, మనము అతనికి మహిమను అందిస్తాము. ఈ విషయాలను మన జీవితాలతో మనము స్థిరంగా చేస్తున్నప్పుడు, దేవుని చిత్తం మరింత స్పష్టమవుతుంది. ఆత్మ సహాయంతో, మనం దేవుని స్వభావాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తున్నందున మనం రోజూ యేసు వలే (2 కొరిం. 3:18) రూపాంతరం చెందుతున్నాము (గల. 5: 22-23).

నా ప్రార్థన

తండ్రీ, "మీ స్వంత మార్గాన్ని కలిగి ఉండండి ప్రభూ ... మీ ఇష్టానికి అనుగుణంగా నన్ను మలచండి మరియు తయారు చేయండి!" అని ఒక పాత గీతములో చెప్పినట్లుగా మీ మహిమ కొరకు ఉపయోగించుకోవడానికి నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా భవిష్యత్తును నేను మీకు సంతోషంగా అందిస్తున్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు