ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

జీవించడానికి మన జీవితాలలో కొన్ని కఠినమైన సమయాలు ఉన్నాయి. అవి తప్పించుకోలేనివి. అలాంటప్పుడు ప్రభువు రక్షణపై మనకున్న విశ్వాసం మరియు ఆయనతో మనకున్న సంబంధం పరీక్షించబడుతాయి! మన ఆరాధన సేవ ముగింపులో "ఇది నా ఆత్మకు క్షేమం" అనే పాట పాడటం ఒక విషయం, కానీ వారు మీ ఇంటిని కోర్టు మెట్ల వద్ద వేలం వేసినప్పుడు మీకు దీర్ఘకాలిక బలహీనపరిచే అనారోగ్యం ఉంటే , లేదా మీరు ఒక బిడ్డను మరణములో కోల్పోయినప్పుడు ఆ పాట పాడగలగడం మరొక విషయం. మనము నరకం యొక్క శివారు ప్రాంతాల గుండా ప్రయాణించినప్పుడు విశ్వాసం సెలవు తీసుకోదు లేదా మన మార్గాన్ని ఎప్పటికీ కనుగొనలేకుండావుండలేము . కాబట్టి దాన్ని విసిరేయకండి. పట్టుదల కలిగియుండండి ! తదుపరి దశకు దేవుడు మీకు బలాన్ని ఇస్తాడని విశ్వసిస్తూ ఒక అడుగు ముందు మరొక అడుగు వేయండి. ప్రస్తుతానికి ఎంత కష్టమైనా నిరాశకు లోనుకావద్దు. యోబు లేదా యిర్మీయా లాగా ఉండండి, ఇద్దరూ వాదించి దేవునికి ఫిర్యాదు చేసారు, కానీ దేవుణ్ణి ఎప్పుడూ వదలేదు . విడిచిపెట్టవద్దు. క్రీస్తు వస్తున్నాడు, మీ కోసం దయతో లేదా మహిమతో ఒకేసారి మరియు అందరికీ, ఆయన రాక మూలమలుపులోనే అనగా సమీపంలోనే వుంది.

నా ప్రార్థన

పరిశుద్ధ మరియు సర్వశక్తిమంతుడైన దేవా, ఈ రోజు మంచి రోజు. అయినప్పటికీ, నేను ఇష్టపడే వారిలో కొందరు మీ ప్రేమ, దయ, కరుణ , శాంతి మరియు విమోచనపై వారి విశ్వాసాన్ని త్రోసిపుచ్చడానికి దగ్గరగా ఉన్నారని నాకు బాగా తెలుసు. దయచేసి వారిని ప్రోత్సహించడానికి నన్ను ఉపయోగించండి. ఇంకా, ప్రియమైన తండ్రీ, వారి హృదయాలను పునరుద్ధరించడానికి మీ పరిశుద్ధాత్మను ఉపయోగించమని నేను అడుగుతున్నాను. సంఘటనల గమనాన్ని మార్చడానికి మరియు వారికి ఉపశమనం కలిగించడానికి మరియు మీ దయగల ఉనికిని వారికి తెలియజేయడానికి మీరు నేరుగా జోక్యం చేసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు