ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నీతిమంతులు ఇబ్బందులు పడతారని మనకు తెలుసు, కానీ దేవుడు మనల్ని వాటన్నిటి నుండి విడుదల చేస్తాడని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రపంచంలోని చాలా చోట్ల ఇటీవల జరిగిన విషాదాలు మరియు విశ్వాసుల హింసల వెలుగులో ఆయన మన ఎముకలన్నింటినీ రక్షిస్తాడని మనం ఎలా అర్థం చేసుకుంటాం? పౌలు జవాబును చూపించాడు అది అతనికి ఏమైనా జరిగితే అది అతని విడుదలనొంది -దేవునితో ఉండడం కోసము అతని మరణం ద్వారా దేవుని యొద్దకు పోవడము అయినా లేదా జైలు నుండి విడుదల పొంది పరిచర్యను కొనసాగించడం ద్వారా అయినా సిద్ధముగా ఉన్నాడని తెలుపుచున్నాడు (ఫిలిప్పి1: 19-23). మన విడుదల స్థిరపరచబడివుంది . మనం క్రీస్తులో విజేతలము . సాతాను మనలను ఏమి చేయలేడు, దేవుని ప్రేమ నుండి మనల్ని దొంగిలించలేడు, మరణం కూడా ఏమి చేయలేదు (రోమా 8: 32-39).

నా ప్రార్థన

తండ్రీ, దయచేసి నా జీవితంలో ఏమైనా జరిగితే నాకు మీ ప్రేమ మరియు విడుదల నుండి నన్ను దొంగిలించలేరని నేను నమ్మాల్సిన విశ్వాసాన్ని నాకు ఇవ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు