ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"నేను వారిని ఇంకా ప్రేమించగలనని నేను అనుకొంటలేదు! నా ప్రేమ నిలువలు అయిపోయినవి , ప్రేమించే నా సామర్థ్యం అయిపోయింది." అవును, ఇతరులు మన ప్రేమ సామర్థ్యాన్ని అలసిపోయే విధముగా చేసే సందర్భాలు ఉన్నాయి, ఎందుకంటే వారి అవసరం చాలా గొప్పది లేదా తిరిగి ప్రేమించడానికి ఇష్టపడకపోవడం వల్ల అయివుండవచ్చు . అలాంటప్పుడు మనం ఎలా కొనసాగాలి? మనకు ప్రేమసమాజము కావాలి; మనకు మద్దతు ఇచ్చే మరియు ప్రేమించే ఇతర విశ్వాసులు కావాలి . క్రీస్తులో మనకు సోదరులు మరియు సోదరీమణులు అవసరం, వారు ప్రేమించే మన సామర్థ్యాన్ని పెంచమని దేవునికి ప్రార్థిస్తారు. మన ప్రార్థనలన్నింటికీ ప్రతిస్పందనగా, దేవుడు తన కృపా ప్రవాహమైన పవిత్ర ఆత్మ ద్వారా మన హృదయాలలో మరింత ప్రేమను కురిపిస్తాడని మనం విశ్వసించాలి (రోమా . 5: 5 కూడా చూడండి ). ప్రేమ తక్కువగా ఉన్నప్పుడు, ఉపసంహరించుకోకండి లేదా వదులుకోకండి. మీకు అవసరమైన సమయంలో సహాయం చేయడానికి అతని దయ కోసం అడుగుతూ దేవునికి మరియు అతని ప్రజలకు దగ్గరవ్వాలని కోరుకోండి (హెబ్రీ. 4:16).

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, దయతో మీ ప్రేమను నా హృదయంలో కురిపించండి మరియు మీ ప్రేమను నా కుటుంబం మరియు సంఘము కుటుంబంలోని వారి హృదయాలలోకి పోయండి. మా చుట్టూ ఉన్నవారిని ఎక్కువగా ప్రేమించాలంటే మీ సహాయం కావాలి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు