ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము క్రైస్తవులముగా మారినప్పుడు, యేసు మనకు పరిశుద్ధాత్మ బహుమతిని ఇచ్చాడు (అపో .కా 2:38; తీతు 3: 3-7). మన శరీరాలను దేవాలయంగా చేస్తూ ఆత్మ మనలో నివసిస్తున్నాడు , (1 కొరిం. 6: 19-20) మరియు అనేక విధాలుగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు (రోమా 8). ఆ ఆత్మ యొక్క ఉనికి కారణంగా దాడి, విమర్శ మరియు అపహాస్యం ఎదురైనప్పటికీ మనం ధైర్యవంతులైన వ్యక్తులుగా ఉండవచ్చు. ఆత్మ ఉత్పత్తి చేసే ఫలములు (గల. 5: 22-23) మరియు ఆత్మ మన హృదయంలో కురిపించే ప్రేమ (రోమా. 5: 5) మనల్ని బలహీనపరచవు. బదులుగా, ఆత్మ యొక్క ఉనికి పాపాన్ని అధిగమించడానికి మరియు స్వీయ-క్రమశిక్షణతో జీవించడానికి మనకు సహాయపడే శక్తివంతమైన బలము (రోమా. 8:13).

నా ప్రార్థన

తండ్రీ, నా జీవితంలో ఆత్మ నిరంతరం ఉన్నందుకు ధన్యవాదాలు. నేను నా జీవితంలో రోజువారీ సవాళ్లను ఎదుర్కొంటున్నందున దయచేసి మరింత ధైర్యం మరియు బలముతో నన్ను శక్తివంతం చేయండి. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు