ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సౌలు తన సరళమైన నేపథ్యం మరియు కులీన కుటుంబ చరిత్ర కారణంగా అతనిని రాజుగా సేవ చేయాలని ప్రజలు కొందరు కోరుకోలేదు. చాలా తరచుగా, ఈ రోజు మనం కూడా అదే పని చేస్తాము - ప్రజలకు ఒక పేరును అంటకట్టి మరియు వారి వారసత్వం లేదా గతం కారణంగా దేవుని ప్రజలను నడిపించడానికి లేదా దేవుని రాజ్యంలో సేవ చేయగల వారి సామర్థ్యాన్ని తగ్గించి మాట్లాడుతాము . దేవుడు, అయితే, ఒక వ్యక్తి యొక్క వంశాన్ని చూడడు. అతను హృదయాన్ని శోధిస్తాడు. కాబట్టి, ప్రియమైన నాయకుడా, దయచేసి ప్రభువుకు దగ్గరగా ఉండండి, ఎందుకంటే మీరు విమర్శించబడతారు. కానీ దయచేసి, ప్రతి చిన్న విమర్శలకు ప్రతిస్పందించవద్దు; బదులుగా, ధైర్యంగా యెహోవా సేవ చేయడానికి మీరే అంకితం కండి . మరియు వారిని అనుసరించేవారలారా , ఆమెకు లేదా అతనికి కొంత గొప్ప వంశవృక్షం లేదు అని ఒకరిని దేవుని నాయకుడిగా పనికిరాడు అని కొట్టిపారేయకండి. బైబిల్లో మనకు కనిపించే కథలలో దేవుడు ఉపయోగించిన అనేక రకాల వ్యక్తులను గుర్తుంచుకోండి. మన రోజుల్లో నాయకత్వం వహించడానికి ప్రజలను ఎన్నుకోవడంలో దేవుడు సృజనాత్మకంగా ఉంటాడని నమ్మండి.

నా ప్రార్థన

ప్రియమైన దేవా, మీ నాయకుల ఎంపికను నేను అనుమానించిన సమయాలను బట్టి నన్ను క్షమించు. మా మధ్యలో మీ నాయకులు ఎవరో గుర్తించే సామర్థ్యాన్ని నా సమాజంతో పాటు నాకు ఇవ్వండి. దయచేసి నిస్వార్థంగా మరియు నమ్మకంగా నడిపించడానికి వారికి ధైర్యం ఇవ్వండి. యేసు నామంలో. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు