ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

తన చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడు? లేఖనాలను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి దేవుడు మనకు లేఖనాలను మరియు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. మరి కొన్ని మరింత సూక్ష్మముగా మరియు తక్కువ నిర్వచించిన ఇతర మార్గాల గురించి ఏమిటి? మనలో చాలా మందికి "దైవిక యాదృచ్చికాల సమూహం" (అనుకోకుండా జరిగేవి ప్రార్థనకు దగ్గరగా ఉన్న అనేక సంఘటనలు) ఉన్నాయి: ఒక స్నేహితుడు సరైన సమయంలో పిలుస్తాడు / లేదా మనకు లేఖ వ్రాస్తాడు; అదే సమయానికి మనము ఒక వ్యాసం చదువుతాము లేదా మా ఆందోళన లేదా గందరగోళం ఉన్న ప్రాంతానికి సంబంధించి ఒక వ్యాఖ్య లేదా రెండింటిని కలిగి ఉన్న ఉపన్యాసం వింటాము; ఆరాధనలోని అనేక పాటలు మనం ప్రభువు నడిపింపు కోరుతున్న ప్రాంతంలో మనలను దోషిగా చేస్తాయి, మనలను గద్దిస్తాయి ; లేదా క్లిష్ట పరిస్థితుల్లో పాపము నుండి వేరై సరైనదాన్ని గుర్తించడంలో మనకు సహాయపడే మన మనస్సాక్షి యొక్క సహాయాన్ని పొందుతాము . మనం నిజంగా జ్ఞానం కోసం ప్రార్థిస్తే అది మనకు ఇస్తానని, మనం నిజంగా ఆయనను వెతుకుతున్నట్లయితే మనం ఆయనను కనుగొంటామని దేవుడు చెప్పినప్పుడు అది నిజంగా జరిగే విషయమే. అతని స్వరం అద్భుతమైన విధానములో ఉరుమువలే ఉంటుంది !

నా ప్రార్థన

పరిశుద్ధ దేవా, దయచేసి నా జీవితంలో అనేక ముఖ్యమైన విషయాల గురించి మీ ఇష్టాన్ని తెలుసుకోవడానికి నాకు సహాయం చెయ్యండి. నా పరిమిత మానవ జ్ఞానం ఆధారంగా నా నిర్ణయాలు తీసుకోవటానికి నేను ఇష్టపడను. నేను వెళ్లి మీకు మహిమ మరియు ఘనతను తీసుకురావడానికి నన్ను ఉపయోగించుకోవాలని మీరు కోరుకునే దిశలోనే దయచేసి మీ ఆత్మ ద్వారా నన్ను నడిపించండి. మీ మార్గాన్ని మరింత స్పష్టంగా చూపించడానికి నా జీవితం గురించి శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు