ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీరు ఎప్పుడైనా ప్రియమైన వ్యక్తి యొక్క సమాధి వైపు నిలబడి ఉంటే- ప్రభువా నీవు ఇక్కడ ఉండివుంటే ! అనే ఈ ఆలోచన మీ మనస్సును కూడా దాటుతుంది.మనం భాదపడినప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు? మనకు సహాయం చేయడానికి అతను ఇక్కడ ఎందుకు ఉండలేకపోయాడు? గుర్తుంచుకోవడానికి కొన్ని కీలకమైన సమాధానాలు ఉన్నాయి. మొదట, మన నష్టం మరియు వేదన యొక్క క్షణాల్లో యేసు మనతో ఉన్నాడు. సంఘము యేసు యొక్క శరీరం మరియు దయ, మద్దతు, ఓదార్పు మరియు సహాయం యొక్క ప్రతి చర్య మన దుః ఖాన్ని తగ్గించడానికి యేసు మనకొరకు సంఘము ద్వారా పనిచేసినట్లే . రెండవది, అతను మన ప్రియమైన వ్యక్తిని ఈ జీవితం నుండి మరొకదానికి వెళ్ళకుండా చేయకపోవచ్చును , శారీరకంగా మరణించిన ప్రతి క్రైస్తవునితో బౌతికంగా వెడలిపోకుండా వారితో కలసి ఉండడానికి ఆయన కట్టుబడి ఉంటాడు. ఒక క్రైస్తవుడు చనిపోయినప్పుడు, అతడు లేదా ఆమె క్రీస్తుతో కలిసి ఉండాలి అని పౌలు మనకు గుర్తుచేస్తాడు (2 కొరిం. 5: 6-7; ఫిలి. 1: 21-23) మరియు దేవుని ప్రేమపూర్వక ఉనికి అతనికి లేదా ఆమెకు ఎప్పటికీ పోదు(రోమా. 8 : 35-39)!

నా ప్రార్థన

పవిత్ర తండ్రీ, దయచేసి నా నష్టం మరియు దుఃఖ సమయాల్లో యేసు పరిచర్య చేస్తున్నట్లు చూడటానికి నాకు సహాయం చెయ్యండి. నాలో నివసించే పరిశుద్ధాత్మ యొక్క ఓదార్పు సమక్షంలో ఆయనను చూడటానికి నాకు సహాయం చెయ్యండి. నాకు సహాయం చేయడానికి మీ ప్రజలు చేసే ప్రేమ మరియు దయ యొక్క చర్యలలో అతన్ని చూడటానికి నాకు సహాయం చెయ్యండి. అదనంగా, ప్రియమైన తండ్రీ, దయచేసి నేను దుఃఖాన్ని అనుభవిస్తున్న మరొకరికి యేసు సన్నిధిగా ఉపయోగపడే మార్గాలను చూడటానికి నాకు సహాయం చెయ్యండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు