ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడిని తెలుసుకోవడం ద్వారా నిజమైన విశ్రాంతి వస్తుంది. దావీదు రాజు ఈ విషయాన్ని 23 వ కీర్తనలో మనకు గుర్తుచేస్తాడు. యేసు మళ్ళీ స్పష్టం చేస్తున్నాడు. యేసు మాత్రమే మనకు దేవుణ్ణి పూర్తిగా వెల్లడించగలడు. కృపను గురించి అవగాహన లేకుండా, దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరుకునే భారాన్ని యేసు మాత్రమే తీసివేయగలడు. ఆయన మాత్రమే మన గత పాపాల భారాన్ని తొలగించి, పవిత్రంగా, నిర్దోషంగా, సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట ఆరోపణల నుండి విముక్తి కలిగించగలడు . (cf. కొలొస్సయులు 1: 21-22)

నా ప్రార్థన

పరలోకంలో ఉన్న తండ్రీ, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి మరియు మీ దయతో నన్ను ఆశీర్వదించడానికి యేసును పంపినందుకు ధన్యవాదాలు. నేను ఆ కృపను ఎప్పటికీ పెద్దగా పట్టించుకోకుండావుండకుందును గాక . ప్రియమైన తండ్రీ, నీ కృప చేత ఎత్తివేయబడిన పాపము భారం నుండి వచ్చిన ఆనందంతో మరియు సంతోషముతో మీకు సేవ చేయడానికి నాకు అధికారం ఇవ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు