ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దాతృత్వము అనేది అద్భుతమైన విషయం - అది స్వీకరించేవారిగా ఉన్నవారికి మాత్రమే కాదు, ఇచ్చే వారిగా ఉన్నవారికి కూడా. మనలో వాక్యభాగాన్ని కంప్యూటర్‌లో ఇ-మెయిల్ ద్వారా చదవగలిగే ఉన్నవారు, ప్రపంచ ప్రమాణాల ప్రకారం గొప్పవారు, కాబట్టి మన ఆశీర్వాదాలవిషయములో దాతృత్వం కలిగి ఉండాలనే ఈ సందేశము ముఖ్యంగా అందరికి వర్తిస్తుంది. సంవత్సరపు ఈ సమయమును ఇతరులకు మన సమయం ఇవ్వడము , శక్తి మరియు ద్రవ్య ఆశీర్వాదాలతో సంవత్సరమంతా ఉదారంగా ఉండవలసిన అవసరాన్ని మనలో తిరిగి పుంజుకోవడానికి దేవుని అవకాశంగా ఉండనివ్వండి.

నా ప్రార్థన

ఓ ప్రేమగల దేవా, మీరు నాతో చాలా ఉదారంగా ఉన్నారు మరియు చాలా అద్భుతమైన ఆశీర్వాదాలతో నన్ను ఆశీర్వదించారు. ధన్యవాదాలు! ఇచ్చే ఆనందం గురించి నా హృదయంలో అవగాహన కదిలించు. నా హృదయాన్ని మీ స్వంత, ఉదార మరియు దయగలగినదానిగా చేయండి. కొన్నిసార్లు నా సమయం, డబ్బు, శక్తి మరియు ప్రేమను నేను పంచుకోకుండా ఉంచి నా దృష్టిని కమ్మివేసే ఆందోళన మరియు దుః ఖాన్ని విచ్ఛిన్నం చేయండి. యేసులో ఉదారంగా ఎలా ఉండాలో నాకు చూపించినందుకు ధన్యవాదాలు. నా రక్షకుడైన ప్రభువైన యేసు పేరిట నేను దీనిని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు