ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

" ప్రఖ్యాత విశ్వాస గృహము " (హెబ్రీయులు 11) లో ఉన్న దేవుని ప్రజల గురించి ఈ వివరణ నాకు చాలా ఇష్టం. మీరు శతాబ్దాలుగా దేవుని ప్రజలను చూసినప్పుడు, వారు బలహీనులు , ఏడ్చేటి చిన్నపిల్లలు మరియు పిరికివాళ్ళ సమూహం కాదు. అవును, వారికి చెడు క్షణాలు ఉన్నాయి. కానీ మొత్తం మీద, వారు తమ అన్వేషణను విడిచిపెట్టిన వారు కాదు. వారి విశ్వాసం నిలకడగా ఉండి, దేవుని గొప్ప విజయాన్ని పొందింది. ఈ వాక్యభాగము నన్ను ఉత్తేజపరుస్తుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ మనము "నశించుటకు వెనుకతీయువారము " అని చెప్పలేదు, బదులుగా అతను మనపై, మన ఓర్పు మరియు మన విశ్వాసంపై నమ్మకంగా ఉన్నాడు. మనము "వెనుకతీయువారము" కాదు, మనము విశ్వాసులం!

నా ప్రార్థన

శక్తిగల మా దేవా , నాపై మీకున్న నమ్మకానికి ధన్యవాదాలు. మీ సహాయంతో, నేను "వెనుకతీయువాడిని" కాను. నా చుట్టూ ఉన్నవారు లేకపోయినా నేను మీ సత్యం, మీ స్వభావం మరియు మీ ఇష్టానికి నిలబడతాను. మీ ప్రజల కోసం మీ ముందు గొప్ప విషయాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను, కాబట్టి నేను వెనక్కి తగ్గడానికి నిరాకరిస్తున్నాను. దయచేసి మీ ఆత్మతో నన్ను బలపరచండి, తద్వారా నేను మీకు మరింత పూర్తి విశ్వాసంతో మరియు చిత్తశుద్ధితో సేవ చేయగలను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు