ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీరు చేసే పనిని చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించునది ఏది?. సాధించడానికి, మరియు ఇంకా ఎక్కువ సాధించడానికి మిమ్మల్ని ప్రేరేపించునది ఏది? అది శక్తినిచ్చు అతని బలవంతపు ప్రేమ అని పౌలు చెప్పాడు. మన ప్రేరణ మరియు ప్రవర్తనలో ప్రేమ నిజంగా బలవంతపు అంశం అయితే మన జీవితంలో ఏమి జరుగుతుంది? యేసు రక్షణ కృప తెలియని వారిని ప్రేమించాలనే మన కోరిక ప్రేమ కారణంగానే మన సమస్తమైన చింతగా మారితే? అతను మరణించాడు కాబట్టి అది చేయవలసివుంది ! మనం అతన్ని నిరాశపరచకూడదు.

నా ప్రార్థన

నిత్యుడగు దేవా, జీవితంలో నా ప్రాథమిక బలవంతపు ప్రేరణగా ప్రేమను అనుమతించాలని నేను కోరుతున్నప్పుడు దయచేసి నాతో ఉండండి. యేసు నన్ను రక్షించడానికి చేసిన ప్రతిదానికీ నా ప్రేమ మరియు ప్రశంసలను నేను చూపించాలనుకుంటున్నాను. కాబట్టి అతను నా జీవితానికి ప్రభువు అని ఇతరులకు తెలుసుకొనులాగున నేను యేసు కోసము జీవించాలనుకొంటున్నాను . నా మాటలు మరియు జీవితం అతని ప్రేమను ఇతరులకు చూపించాలని నేను కోరుకుంటున్నాను, తద్వారా వారు అతని ప్రేమను నిజంగా అనుభవించవచ్చు మరియు అతనిని తెలుసుకోవాలి. నేను ఈ లక్ష్యాన్ని అనుసరిస్తున్నప్పుడు దయచేసి నన్ను ఆశీర్వదించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు