ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పాటలు మనల్ని కదిలించగలవు, లేదా అవి మనకు ఓదార్పునిస్తాయి. పాటలు మనల్ని ఒక ప్రత్యేక సమయానికి తీసుకెళ్ళవచ్చు లేదా పాటలు మనకు రాబోయే విషయాలపై ఆశను కలిగిస్తాయి. దురదృష్టవశాత్తూ, మనం సాధారణంగా మన పాటల పదాలు మరియు సంగీతాన్ని మరొకరు వ్రాయడానికి అనుమతిస్తాము. మనము మన స్వంత "కొత్త పాట" వ్రాయడానికి సమయం తీసుకోము. కానీ నేడు, దేవునికి మీ కృతజ్ఞతలు తెలుపుతూ మీ కొత్త స్తుతి పాటను ఎందుకు తయారు చేయకూడదు? ఇది గొప్పగా ఉండవలసిన అవసరం లేదు, హృదయపూర్వకంగా మరియు సమస్త ఆనందకరమైన పాటలు చెందు తండ్రికి సమర్పించబడితే చాలు.

నా ప్రార్థన

పరమతండ్రి , పాట అనే బహుమతికి ధన్యవాదాలు. దయచేసి మీరు మీ ఆనందంతో నిండిన హృదయం నుండి నా ధన్యవాదాలు మరియు స్తుతి పాటను స్వీకరించండి. ఓ దేవా, యేసు నామములో నీకు నా కృతజ్ఞతలు మరియు స్తుతులు సమర్పించుచున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు