ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నిరాశ మరియు అసూయ ...మ్ మ్ , చెడు మరియు ఇంకా అభివృద్ధి చెందుతున్నవారి పట్ల మన స్పందన ఇది కాదా? దుర్మార్గుల యొక్క స్పష్టమైన మరియు స్వల్పకాలిక విజయాలు మన విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు లేదా మన ఆత్మలను మందగించనివ్వవని మనకు గుర్తు చేయబడింది. వారి విజయాలు తాత్కాలికమైనవి, వారి సంపద వాడిపోయే పువ్వు లాంటిది, మరియు వారి జీవితం ఎండిపోయే గడ్డి లాంటిది మరియు త్వరలోనే పోతుంది.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన యెహోవా, మీ పవిత్రమైన, సాటిలేని నామాన్ని స్తుతించబడును గాక . మీరు నన్ను ఎంతో ఆశీర్వదించారు. నా శత్రువుల ఎదుట మీరు నన్ను రక్షించారు. మీరు నాకు జీవితాన్ని, ఆశను, భవిష్యత్తును మీతో ఇచ్చారు. ఇప్పుడు దయచేసి, ప్రియమైన తండ్రీ, ఇతరులు ఏమి కలిగి ఉన్నారో అని చింతిస్తూ నా సమయాన్ని వృథా చేయకుండా ఉండటానికి నాకు సహాయం చెయ్యండి. దయచేసి నన్ను ఆశీర్వదించడానికి మీరు చేసిన అన్నిటికీ నాకు కృతజ్ఞత మరియు సంతృప్తి కలిగించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు