ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

￰యేసు క్రీస్తుకు ఉన్నటువంటి నామములకంటే యేసు ప్రభువు మన పాలకుడు మరియు రాజు అనే మాటలను ఆయన రాజ్యములో మనము మన జీవితాలను కట్టుకోగలిగే మూల స్తంభాలు. ఆయన మన ప్రభువు మరియు రాజు ఆయన మన బోధకుడు మరియు ఉపదేశకుడు.మన హృదయాలు ఆయనకు కట్టుబడి ఆయన నడిపింపునకు సిద్దపడియున్నవి.మన హృదయములలో మరియు జీవితములో యేసుతో ఏ విరోధవత్వము లేదు. యేసే క్రీస్తు,ఆయనే మెస్సయ్య పాతనిబంధనలో వాగ్దానము చేయబడ్డ రక్షకుడు.ఎవరి గూర్చిఅయితే ప్రవక్తలు మాట్లాడిరో ఆయనే ఈయన.పాలకుడు ,రక్షకుడు, మెస్సయ్య, మనలను దేవుని ఇంటికి తీసుకొనివచ్చు దేవుని యొక్క బహుమానం.మనకు క్షమాణపన,విదుదల,మరియు రక్షణ తీసుకొనివచ్చుటకు సిలువపైకి ఎక్కినవాడే ఈ యేసు.సిలువవేయబడిన ఆయనే ప్రభువును మరియు క్రీస్తు అయియున్నాడు.

నా ప్రార్థన

ప్రభువా, నీ శక్తివంతమైన నామాన్ని మేము స్తుతిస్తున్నాము మరియు మీ దయ మరియు త్యాగపూరిత ప్రేమకు ధన్యవాదాలు. ప్రియమైన తండ్రీ, మా పాపాల కోసం చనిపోవడానికి మరియు మాకు నిరీక్షణను ఇవ్వడానికి మరియు మాకు రక్షణను తీసుకురావడానికి మీ కుమారుడైన యేసును పంపినందుకు మేము నిన్ను స్తుతిస్తున్నాము. సార్వభౌమ దేవా, నా హృదయాన్ని యేసుకు అప్పగించడానికి మరియు నా రక్షణకు ప్రభువును స్తుతించడానికి నా పెదవులను తెరవడానికి దయచేసి నాకు సహాయం చేయండి. యేసు యొక్క శక్తివంతమైన నామంలో, మరియు ఆత్మ యొక్క మధ్యవర్తిత్వం ద్వారా, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు