ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు జీవించుచున్న నిజమైన నాయకుడును మరియు తన సంఘమునకు శిరస్సైవున్నాడు.ఈలాంటి ￰అర్హత కలిగిన మనుషుడు ఈయన తప్ప మరెవరును లేరు.కేవలం యేసు తప్ప ఈ స్థానమును సంపాదించినవారు మరెవరును లేరు. యేసు అత్యున్నతమైనవాడు.ఆయన దైవత్వాన్ని బట్టి ఆయనయొక్క అత్యున్నత స్థితి న్యాయమైనదే అయినప్పటికీ అయన మనకు ఏదైతే చేసెనో దానిని బట్టి అత్యున్నత స్థాయిని పొందెను.సృష్టి ఆరంభమునకు ముందే అయన వున్నాడు, అయన సమస్తమును సృజించిన సృష్టికర్త, మరియు ఆయన మనకొరకు అత్యంత విజయవంతముగా మరణముగుండా దాటివెళ్లినవాడు.

నా ప్రార్థన

యేసు ప్రభు , మీ సంఘము , మీ శరీరము ఫై ఆదిపత్యమును కలిగియుండమని ప్రార్థిస్తున్నాను. దయచేసి మాలో మిమ్మును మీరు మహిమపరచుకొనండి. మరియు మా నాయకుల హృదయాలను నీ చిత్తానుసారం నడిపించండి. మన ఐక్యత మరియు భక్తి కారణంగా ప్రపంచం మీ ఆధిపత్యాన్ని చూడాలని మేము కోరుకుంటున్నాము. మరియు పరిశుద్ద దేవా, దయచేసి సంఘము ద్వారా యేసులో మిమ్మల్ని మీరు మహిమపరచుకొనండి. నీకు ప్రభువైన యెహోవా, నీ కుమారుడు మరియు మా రక్షకుడైన యేసుకు సమస్త మహిమ, కీర్తి, ఘనత నిరంతరంగా ఉండుగాక . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు