ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

అనేకులు దేవుని కొరకు తాము విడిచిపెట్టలేని వాటిని బట్టి దేవునిని తిరస్కరిస్తుంటారు.అటువంటి￰వారు తమ తెలివైన వాదనలతో ఆ విషయాన్నీ దాచవచ్చు.ఎందుకంటె వారివరకు తమ ఆలోచనను దేవునికి లోపరచటమంటే దేవుని స్వభావానికి విరుద్ధమైన తమ ఇష్టాలను విడిచిపెట్టడమే. తెలివైన వాదనలుఎప్పుడో ఒకప్పుడు ఈ విధమైన వ్యక్తిని సత్యం కొరకు గెలుస్తాయని అనేక మంది సువార్తికులు ఎరుగుదురు. అలాకాకుండా దేవుడు వారి శత్రువు కాదు కానీ మిత్రుడు కాబట్టి వారిలో పరిశుద్దతను కోరుకుంటున్నాడు అని వారు గ్రహించడానికంటే ముందు వారు యేసును మరియు ఆయన త్యాగ పూరితమైన ప్రేమను తప్పక తెలుసుకోవలెను.

నా ప్రార్థన

పరిశుద్ధ మరియు సర్వశక్తిమంతుడైన దేవా, నీ ప్రేమ మరియు పరిశుద్దతకు నేను నిన్ను స్తుతించుచున్నాను. నన్ను రక్షించడానికి యేసును పంపటం ద్వారా ఆ రెండు కనపరిచినందుకు కృతజ్ఞతలు. పరిశుద్ధత కొరకైన మీ కోరిక చాలా బలవంతపెట్టినదిగాను లేదా కఠినమైనదిగా భావించిన సమయాలను బట్టి నేను చింతిస్తున్నాను. యేసులో నన్ను కాపాడటానికి మాత్రమే కాక మీ రక్షణ మరియు సంరక్షణ క్రింద ఒక పరిశుద్ధ జీవితానికి నన్ను పిలుచునంతగా కూడా నన్ను ప్రేమించినందుకు మీకు కృతజ్ఞతలు . యేసు నామములో నేను ప్రార్ధిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు