ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన పిల్లలకు, మన స్నేహితులకు, మన చిన్న ఆత్మీయ "పిల్లలకు" విశ్వాసాన్నిఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, పౌలు మాదిరిని మనం గుర్తుంచుకోవాలి. అతను సత్యాన్ని బోధించాడు; తనకు బయలుపరచిన సత్యాన్ని ఇతరులకు పంపించారు; అతను తన జీవితంలో ఆ సత్యాన్ని ప్రదర్శించాడు; పౌలు తన దైనందిన జీవితంలో ఈ సత్యాన్ని ఆచరణలో పెట్టడానికి తాను నడిపిస్తున్న ప్రజలను పిలిచాడు. ఇది వారి జీవితాలలో దేవుని ఉనికిని పూర్తిగా అనుభవించడానికి మరియు దేవుడు వారికి ఇవ్వడానికి ఎంతో ఆశగా ఉన్న శాంతిని కనుగొనటానికి వీలు కల్పిస్తుంది.

నా ప్రార్థన

తండ్రీ, నా చుట్టూ ఉన్నవారిని, వారి క్రైస్తవ నడకలో నా సహాయం అవసరమైనవారిని, మరియు నా కుటుంబంలో ఉన్నవారు మీ కృపలో ఎదగాలని కోరుకునేవారిని ప్రభావితం చేయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నాకు మాట మరియు పనిలో మంచి గురువుగా ఉండటానికి సహాయం చెయ్యండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు