ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పనికిరాని ప్రతి మాటకు మన లెక్క చెప్పుటను గురించి యేసు హెచ్చరించాడు (మత్తయి 12: 36-37). పౌలు దానిలో ఒక అడుగు ముందుకు వేసి, క్రీస్తును ఎరుగని వారిపట్ల ఇది ఎంత ముఖ్యమో నొక్కి చెప్పాడు. క్రైస్తవులు కానివారి మన చుట్టూ ఉన్నప్పుడు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరియు వారు మన మాటలను ఉపయోగించుకునే విధంగా దయ, సంరక్షణ మరియు నియంత్రణను చూపించాలని మేము కోరుకుంటున్నాము. ఒకరి నిత్యజీవము వారితో మన జరిపే సంభాషణలపై ఆధారపడి ఉండవచ్చు.

నా ప్రార్థన

పవిత్ర మరియు నీతిమంతుడైన దేవా , మేము, మీ ప్రజలు, అవిశ్వాసులను గాయపరచినప్పుడు మరియు అవిశ్వాసులని ఆలోచనా రహితమైన మాటలతో మరియు సోషల్ మీడియాలో క్రూరమైన పోస్ట్‌లతో తరిమివేసినప్పుడు మేము మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తున్నామని నాకు తెలుసు. దేవా, నాకు సహాయం చెయ్యండి, నేను ప్రజలందరితోనూ, ముఖ్యంగా యేసును తమ ప్రభువు మరియు రక్షకుడిగా ఇంకా అయన గురించి తెలియని వారి పట్ల ఒక అద్భుతమైన వైఖరిని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రజల హృదయాలను యేసు కొరకు తెరవడానికి నా జీవితాన్ని, నా మాటలను ఉపయోగించండి. యేసు నామంలో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు