ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన ప్రపంచ చరిత్రలో చాలా సార్లు , క్రూరమైన ప్రభుత్వాలు, జాతిపరమైన ద్వేషం మరియు మానవ అన్యాయాల నేపథ్యంలో దేవుని వాగ్దానము ఒక ఎండమావు మాదిరిగా కనిపిస్తున్న సందర్భాలు వున్నాయి . కానీ కాలక్రమేణా, క్రూరమైన ప్రభుత్వాలు విరగగొట్టబడుతుంది . నిరంకుశ పాలన వారి సమాధులలోకి వెళ్లిపోయింది . నైతిక కోపం నిశ్శబ్దంచే భర్తీ చేయబడినది.రాజ్య ప్రజలుగా, మనము దేవుని చిత్తానికి ,నైతిక విలువలకు , విలువలకు మాదిరిగా ఉండాలి అని మీరు అనుకొనరా? కాబట్టి "నీ చిత్తము భూలోకమందు నెరవేరునట్లు పరలోకమందు కూడా నెరవేర్చబడునుబడునుగాక ." అని యేసు మనకు బోధించిన ప్రార్థనను పునరుద్ధరిద్దాము మరియు మన కుటుంబాలలో, స్నేహితులలో , మరియు సంఘాలలో దేవుని చిత్తాన్ని ప్రదర్శిద్దాం.

నా ప్రార్థన

పరిశుద్ధుడు మరియు నీతిమంతుడవైన దేవా, క్రూరత్వముతో ప్రపంచములోని , విలువైన, అమాయక ప్రజలను అణచివేస్తున్నందుకు మీరు మాకంటే కూడా ఎక్కువ తపించుచున్నారని నాకు తెలుసు. తండ్రి, వారి అన్యాయం విషయములో క్రూరమైన ఆ దేశాలకు దయచేసి నీ చిత్తాన్ని మరియు నీ క్రమశిక్షణను చూపించు . వ్యక్తిగతముగా మరియు సంఘాలుగా , ఐకత్య ,న్యాయం, స్వస్థత, నిరీక్షణకు నిలయాలుగా వుండునట్లుగా మమ్ములను బందించండి . సమాజములో అణచివేత నుండి స్వేచ్ఛ అవసరం వున్నవారు మరియు జీవితంలోని ప్రతీ ప్రాంతంలోనూ న్యాయం కోసం నిలబడాలని అనుకునేవారికి మీ నీతి మరియు మీ న్యాయాన్ని చూపించడానికి నన్ను మరియు నాతోపాటు నా సహోదరి సహోదరులను వాడుకొనండి యేసు నామమున ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు