ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

క్రైస్తవులుగా, మన శరీరం చనిపోయినా, మనం చనిపోము! మన భౌతిక మరణం అంటే మనకు అమర శరీరాలు ఇవ్వబడటం. క్రీస్తు మనలను లేపి అమరత్వాన్ని ధరింప చేస్తాడు. మనం దేవుని పిల్లలం కాబట్టి మరణం మనపై పట్టు సాధించదు. మనం మహిమాన్విత ప్రభువైన యేసులా ఉంటాము మరియు ఆయనను నిజంగా ఉన్నట్లుగానే చూస్తాము. విజయం మనదే. మరణానికి చివరి మాట లేదు. యేసుకే చివరి మాట ఉంది. మరియు ఒక రోజు ఆయన మనతో, "లేవండి!" అని చెబుతాడు.

నా ప్రార్థన

తండ్రీ, నా భౌతిక శరీరం బలహీనముగా ఉందని నాకు తెలుసు. ప్రియమైన తండ్రీ, నేను ఎంత మంచి స్థితిలో ఉన్నా లేదా నా ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్తగా ఉన్నా, నా శరీరంలో భౌతిక మరణ ప్రక్రియను నేను ఆపలేనని నాకు తెలుసు. కానీ నా భౌతిక శరీరం విఫలమైనా, మీరు విఫలం కారని తెలుసుకోవడం నాకు ఉత్సాహంగా ఉంది. నా మానవ శరీరం బలహీనంగా ఉన్నప్పటికీ, మీరు శక్తివంతులు మరియు విజయవంతమైనవారని నాకు తెలుసు. తండ్రీ, నా కోసం యేసు తిరిగి రావడం మరియు నా పరివర్తన యొక్క మహిమ మరియు శక్తి ద్వారా మరణం మ్రింగివేయబడిన విజయ దినం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆ రోజు వరకు, ప్రియమైన దేవా, నిన్ను ముఖాముఖిగా చూడటానికి నేను ఎదురు చూస్తున్నప్పుడు ఆనందంతో నిన్ను సేవిస్తున్నాను. యేసు యొక్క శక్తివంతమైన నామంలో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు