ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుని గురించి మనకు తెలిసినది ఏదో అది మన చిన్ని బుర్రలకు, మన పరిమితమైన అనుభవాలకు, లేఖనములలోని దేవుని గొప్ప క్రియలను చదవటానికైన మన సిద్ధపాటు మరియు మా పూర్వ క్రైస్తవుల జీవితాలలో దేవుడు చేసిన సాటిలేని క్రియలనుగూర్చి వినుట వంటి వాటి వరకు మాత్రమే కుదించబడినవి.ఆరాధన, విధేయత, మరియు అనుభవముల ద్వారా ప్రభువును యెరిగి ఆయన శక్తిని తెలుసుకొనిన, కృపచేత నింపబడిన మన పూర్వ క్రైస్తవుల అనుభవాలు వినుటకంటె మించిన పరిపూర్ణత మరేది లేదు.

నా ప్రార్థన

మహా శక్తివంతుడవైన దేవా, నీ కృపను బట్టి నేను నిన్ను అబ్బా , తండ్రి అని పిలువ గలుచున్నాను.నీ మహిమ నా సామర్ధ్యమునకు మించినది, మరియు నీ శక్తిని గ్రహించుట నా సామర్ధ్యానికి మించినది. ప్రియమైన తండ్రి ఏదైతే నాకు తెలుసునో, ఏవి నాకు అర్ధమైనవో అవి విధేయతతో లోబడిన ఆరాధనకును మరియు భక్తితో కూడిన ప్రశంసకును నా మోకాలు వంగునట్లు చేయుచున్నవి. నీ మహిమను సమీపించదగినదిగాను మరియు మరణము నుండి నన్ను విడిపించునదిగా చేసిన నీ ప్రేమ, కరుణ, మరియు నీ కృపకు కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ఆమేన్..

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు