ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

అసంఖ్యాకమైన విషయాల వల్ల జీవితం పట్ల నిరాశ మరియు అసంతృప్తి కలగవచ్చు. కానీ మనలో చాలా మందికి, ఇవి మనపై మనం ఎక్కువగా దృష్టి పెట్టడం మరియు జీవితంపై కోపంగా ఉండేలా చేసే లక్షణాలు.మనము మన ఆశీర్వాదాలను లెక్కించడం మరచిపోయాము, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం విస్మరించాము, మన తండ్రిని స్తుతించడంలో మౌనంగా ఉన్నాము మరియు మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడం మానేశాము. ఇతరుల గురించి ఆలోచించడం క్రీస్తులా జీవించడమే . మనం అతని మాదిరిని అనుసరించినప్పుడు, మన చర్యలు మనం ఆశీర్వదించే వారి జీవితాల్లో మార్పును కలిగిస్తాయి మరియు మనం కూడా ఎంతో ఆశీర్వదించబడతాము. మన దృష్టిని మనపై వుంచుకొనడాన్ని నిలిపివేసి, మన పొరుగువారిని ఆశీర్వదించేలా చూద్దాం!

నా ప్రార్థన

పవిత్రమైన మరియు సాటిలేని దేవా, నా చుట్టూ ఉన్న జీవితాలలో విచ్ఛిన్నం, బాధ మరియు కష్టాలను చూడటానికి నాకు సహాయం చెయ్యండి. మీ ప్రేమ మరియు దయను అనుభవించాల్సిన అవసరం ఉన్న ఇతరులను ఆశీర్వదించడానికి దయచేసి నన్ను ఉపయోగించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు