ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం￰ దేవుణ్ణి స్తుతించగల అనేక విషయాలు ఉన్నప్పుడు, ఆయన ప్రణాళిక వేసి వాగ్దానం చేసిన దానిని చేయడములో ఆయనకున్న విశ్వసనీయతను స్తుతించడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం.మనలో చాలామంది పెద్ద కలలను కలిగినవారు , పథకాలు వేసేవారు ఉన్నప్పుడు, దేవుడు,తాను మాత్రమే చేయగల అద్భుతమైన పథకాలను నెరవేర్చగలడు!

నా ప్రార్థన

అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన దేవా, వైవిధ్యభరితమైన మరియు అందాన్ని కలిగి ఉన్న ఒక ప్రపంచాన్ని గూర్చి ఆలోచన చేసినందుకు ధన్యవాదాలు.మీ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన రచనలకు ధన్యవాదాలు. ఈ లోకాన్ని సృష్టించుటకు ముందే మాకు రక్షణను అందించుటకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు.మిమ్మల్ని గౌరవిస్తూ, మీకు మహిమ తీసుకురావడానికి నేను చేసే ప్రణాళికల్లో మరింత శ్రద్ధగా, క్రమశిక్షణతో పనిచేయినట్లు నాకు సహాయం చెయ్యండి.యేసు నామమున నేను నిన్ను స్తుతించెదను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు