ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

బాప్తీస్మం అనగా తడిసిపోవడం లేదా దేవుని యెడల మనకున్న విధేయతను కనపరుచు క్రియల యొక్క పట్టికను సరిచూసుకొనుటకంటె కంటే చాలా ఎక్కువ. మనలను రక్షించునది ఏదో మీరు చూసారా అదే యేసు మరణం, సమాధి మరియు పునరుత్థానం (1 కొరిం. 15: 1-5). విశ్వాసం ద్వారా యేసు యొక్క రక్షించే క్రియలో పాలుపంచుకుని, బాప్తిస్మంలో అనుభవించగలిగిన నమ్మశక్యంకాని దయను (రోమా 6: 1,14,15) దేవుడు మనకు ఇచ్చాడు (గల. 3: 26-27). మనం పాత జీవన విధానానికి చనిపోతాము మరియు దానిని గతంలో పాతిపెడతాము. ఇది ఇకపై మనలను పట్టుకొనివుండదు.ఈ మరణం చాలా ముఖ్యమైనది. క్రొత్త జీవితానికి పునరుద్ధానము చేయబడిన మన జీవితం ఇప్పుడు క్రీస్తుతో కలిసిపోయింది మరియు అతని భవిష్యత్తు ఇప్పుడు మన సొంతమవుతుంది ( కొలొ. 3: 1-4 కూడా చూడండి). మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం దేవుణ్ణి మహిమపరచడం మరియు ఆయనతో శాశ్వతంగా జీవించడం కొరకువున్నది .అంటే సువార్త కేవలము బోధించబడిన ఒక విషయం మాత్రమే కాదు; ఇది అయన కృప ద్వారా మనం అనుభవించే విషయం.

నా ప్రార్థన

యేసులో నాకోసం నన్ను మరణం నుండి మీ కొత్త జీవితానికి లేవనెత్తినందుకు నీకు ధన్యవాదాలు తండ్రి. యేసును పంపించడంలో మీ కృపకు ధన్యవాదాలు. యేసు మరణం, ఖననం మరియు పునరుత్థానం నాచేత అనుభవింభ చేసిన మీ కృపకు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన మీ శక్తివంతమైన కృపను నా జీవితం ప్రతిభింపింపచేయును గాక . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు