ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నమ్మకము . ఇది అర్ధహృదయంతో చేసేది కాదు. అది ఉంటే పూర్తి నమ్మకమై ఉండవలె లేదా అనుమానంతో మేఘావృతమైనదైనా అయిఉండాలి. కాబట్టి మనం రోజువారీ జీవిత సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు లేదా లోతైన మరియు కష్టమైన సమస్యలలో సమాధానాల కోసం చూస్తున్నప్పుడు, యెహోవాపై మన పూర్తి నమ్మకాన్ని ఉంచుదాము. మన ఎంపికలు చేసుకునేటప్పుడు ఆయన జ్ఞానం మరియు మార్గదర్శకత్వం కోసం అడుగుదాం. మన జీవితంలోని మంచి కోసం ఆయనకు మహిమను చెల్లిద్దాము మరియు రాబోయే రోజులకు ఆయన ఆశీర్వాదం కోరుకుందాం. ఎందుకు? ఎందుకంటే, ఇప్పుడు మరియు ఎప్పటికీ మనకు జీవితాన్ని ఆశీర్వదించాలని ఆయన ఎంతో ఆశపడుచున్నాడు.

నా ప్రార్థన

యెహోవా, నా ప్రభూ, నేను మీ మీద నమ్మకం ఉంచాను. నేను మీకు మహిమను తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దయచేసి నా దిశలను మార్గనిర్దేశం చేయండి. నేను ఎదుర్కొనే నిర్ణయాలలో నాకు సహాయం చెయ్యండి. నేను ఇతరులను ప్రభావితం చేయటానికి మరియు మీ దయను వారితో పంచుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నాకు వివేచన ఇవ్వండి. నా కుటుంబంపై, నా స్నేహితులలో,మరియు నా సహోద్యోగులలో విముక్తి కలిగించే విధంగా చెప్పడానికి నాకు సరైన పదాలు ఇవ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు