ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

క్రైస్తవ నాయకుడు అయినవాడు కలిగివుండే ఒక గొప్ప గౌరవం మరియు బాధ్యతలు ఏమనగా దేవుని కుటుంబములో ఒక పాస్టరుగా లేదా కాపరి నియమించబడుటయే.కేవలము కొద్దిమంది మాత్రమే దేవుని మందపై కాపరులుగా గుర్తించబడివుండగా (అపొస్తలుల కార్యములు 20; 1తిమోతి 3;తీతు 1), ఇతరులపట్ల కాపరిగా శ్రద్ధచూపుటయే మనందరికి ప్రాముఖ్యమైనది.మన కాపరులుగా ఎంపికైన వారికి హృదయ సమగ్రత, ప్రజల పట్ల శ్రద్ధ చూపడంలో నిరూపితమైన నైపుణ్యం ఉండాలని హక్కుగా అడుగుదాము .వారు నడిపిస్తున్నప్పుడు, కృషి, ప్రార్థన, పరిచర్య వంటి వాటికి మన మద్దతును తెలుపుదాము .

నా ప్రార్థన

ఓ గొప్ప కాపరీ,యథార్థమైన దైవ నైపుణ్యంతో మీ గొర్రెలను మేపునట్లు నీ సంఘములో గొప్ప నాయకులను నీవు లేవనెత్తుతావని నేను నిత్యము ప్రార్ధిస్తున్నాను.యేసు నామమున నేను ప్రార్ధిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు