ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము ఆయన ఆశీర్వాదముల కొరకు వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు . అతను మన జీవితాలను మార్చాలని కోరుకుంటున్నందువల్ల కాదు, మనలను ఆశీర్వదించాలని మరియు మన జీవితంలోని బహుమతులు ఆయన నుండి వచ్చాయని మనము తెలుసుకోవాలని చూస్తున్నాడు . కాబట్టి ఆయన ఉనికిని, ఆయన కృపను, ఆయన ఆశీర్వాదాలను కోరుకుందాం.

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, మీ ఆశీర్వాదం మరియు మార్గదర్శకత్వం నాకు అవసరం. దయచేసి నా హృదయంపై అధిక బరువు ఉన్న అనేక విషయాలలో నన్ను ఆశీర్వదించండి ... (మీ హృదయంలో ఉన్న కొన్ని విషయాలను దేవునితో పంచుకోండి). అంతేకాక , ప్రియమైన తండ్రీ, ఈ క్రింది విషయాలలో మీ జ్ఞానం నాకు అవసరం ... చివరగా, ప్రియమైన దేవా, దయచేసి ఈ వారం నా జీవితంలో మీ ఉనికిని నాకు చాలా స్పష్టంగా తెలియజేయండి. నా పట్ల మీకున్న ప్రేమను నేను అనుమానించను, కాని ఈ సమయంలో నా ముందు ఉన్న సవాళ్లను నేను ఎదుర్కొంటున్నప్పుడు మీరు సమీపముగా వున్నారని నాకు నమ్మకమును ఇవ్వండి . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు