ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నేను నాకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు , నా స్వంత నిర్ణయాలకు నేను బాధ్యత వహించాలనుకుంటున్నాను, నా జీవితాన్ని తన ఇష్టానికి సమర్పించడానికి మరియు ఆయనపై నా నమ్మకాన్ని ఉంచడానికి దేవుడు నన్ను అనుమతించినందుకు నేను నిజంగా కృతజ్ఞుడను. తన చిత్తాన్ని చేయటానికి (ఫిలి. 2:13) మరియు నా మంచి కోసం తండ్రి నాలో పని చేస్తున్నాడు (రోమా. 8:28). నా ప్రణాళికలు ఆయన ఇష్టానికి లోబడి ఉన్నాయని నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను. నా లక్ష్యాలు మరియు విజయాలు అతని చేతుల్లో ఉన్నాయని నేను అభినందిస్తున్నాను. నా ముందు ఉన్నది "ప్రభువు చిత్తమైతే" అను ఒక్క వాక్యములోనికి సంక్షిప్తము చేయవచ్చు అని నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను.

నా ప్రార్థన

అబ్బా తండ్రీ, నా జీవితం మరియు నా భవిష్యత్తు మీ చేతుల్లో వున్నందుకు ధన్యవాదాలు. నాలో, నా సొంత ప్రణాళికలు చాలా నిండివుండి కావాలని మీపై ఆధారపడని ఆ సమయాలను బట్టి నన్ను క్షమించండి. నా స్వంత మూర్ఖమైన అహంకారం చుట్టూ నిర్మించిన విఫలమైన ప్రణాళికల కారణంగా నేను చేసిన గందరగోళాల నుండి నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. ప్రియమైన తండ్రీ, నేను నా ప్రణాళికలను,నా జీవితాన్ని మరియు నా భవిష్యత్తును మీ ఇష్టానికి లోపరచుచున్నాను . యేసు పవిత్ర నామంలో, మరియు అతని శక్తితో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు