ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
కుమారునిగా గానీ, కుమార్తెగా గానీ, నేను నా తండ్రికి ఇవ్వగల గొప్ప బహుమతి ఏమిటంటే, పరలోకమందున్న నా తండ్రి వలె నీతియుక్తమైన స్వభావం, దయగల కరుణ, మరియు నమ్మకమైన ప్రేమగల దయతో నిండి ఉండటమే. పరిశుద్ధాత్మ సహాయంతో, మనం "ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము" (గలతీయులకు 5:22-23) వంటి గుణగణాలు గల ప్రజలుగా మారగలము. ఇటువంటి గుణగణాలు మన తండ్రిని మరియు మన భూలోక పితరులను గౌరవిస్తాయి. దేవుని పిల్లలుగా, పరిశుద్ధాత్మ సహాయం కోరుతూ, ఆ గుణాలను పాటిస్తూ జీవిద్దాం. ఆ గుణాలను మరియు మన జీవిత స్వభావాన్ని ఉపయోగించి మన భూలోక పితరులకు సంతోషాన్ని, మన పరలోక తండ్రికి ఆనందాన్ని కలిగిద్దాం!
నా ప్రార్థన
పరిశుద్ధుడవైన, నీతిమంతుడైన తండ్రీ, నా జీవితం మీకు ప్రీతికరంగా ఉండి, నా తండ్రికి మరియు ఆయన నామానికి ఘనతను తెచ్చుగాక. పరలోకమందున్న ప్రియమైన తండ్రీ, నేను మీకు ప్రీతికరంగా ఉంటే, అది నా భూలోక తండ్రి హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. నా జీవితంలో మీ స్వభావాన్ని మరింత చక్కగా ప్రదర్శించే రీతులలో మిమ్మల్ని తెలుసుకొని, సేవించడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు దయచేసి నాకు సహాయం చేయండి. ఇది నా భూలోక తండ్రికి మరియు ఆయన కీర్తికి ఘనతను తెచ్చి, మీకు ఆనందాన్ని కలిగించుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.


