ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం ఒకరికొకరు, మనకోసం ప్రార్థించగలిగే ఉత్తమమైన వాటిలో ఒకటి, మనం దేవుణ్ణి బాగా తెలుసుకోవడం గూర్చినది . దేవుణ్ణి బాగా తెలుసుకోవటానికి (1 కొరిం. 2), దేవుణ్ణి ఆరాధించదానికి (యోహాను 4), మరియు దేవునితో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ మనకు సహాయపడతాడు (రోమా. 8). అతని గురించి మాత్రమే తెలుసుకోవడమే కాకుండా, ఆయనను తెలుసుకోవడంలో తన ఆత్మను ఉపయోగించమని దేవుడిని అడుగుదాం. దేవుడు సర్వశక్తిమంతుడు మాత్రమే కాదు; అతను మన గురించి లోతుగా శ్రద్ద తీసుకునే మన తండ్రి కూడా.

నా ప్రార్థన

పరిశుద్ధుడగు తండ్రి, సమస్త రహస్యం మరియు మహిమలకు అర్హుడవగు దేవా , దయచేసి నాలో మీ పరిశుద్ధాత్మ ఉనికి ద్వారా మిమ్మల్ని బాగా తెలుసుకోవటానికి నా మనస్సు మరియు హృదయాన్ని తెరవండి. దయచేసి నా శారీరక మరియు ఆధ్యాత్మిక కుటుంబాన్ని మీ గురించి, మీ ప్రేమ మరియు మీ మహిమను గురించి అంతర్దృష్టి మరియు ప్రకాశంతో ఆశీర్వదించండి. మేము మిమ్మల్ని మరింత పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాము మరియు మీ స్వభావము మరియు దయను మరింత పూర్తిగా ప్రతిబింబించాలనుకుంటున్నాము. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు