ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నిన్నటి రోజున పాత నిబంధనలోని ఆలయం గురించి సొలొమోను చేసిన గొప్ప అంకితభావముతో కూడిన ప్రసంగం మనకు గుర్తుకు చేయబడింది.ఆశ్చర్యకరముగాయెరూషలేము ఆలయంలో తన నివాసాన్ని ఎంతో గంభీరంగా ఏర్పరచుకున్నట్లుగానే , దేవుడు తన ఆత్మ ద్వారా మనలో తన నివాసంను ఏర్పరచుకున్నాడని పౌలు నొక్కిచెప్పాడు. దేవుడు తన పవిత్ర నివాసంగా మనలను అంగీకరించడానికి అతనికి చాలా గొప్ప వేల చెల్లించవలసివచ్చింది -అది అతని కుమారుడి మరణం! మనలో ఆయన పవిత్ర ఉనికిని గౌరవించకుండా మనం ఎలా నిరాకరించగలం? ఆయన కృపకు ప్రతిస్పందనగా మనం పవిత్ర జీవితాన్ని గడపకుండా ఎలా ఉండగలము?

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, నాలో మీ ఉనికి యొక్క అద్భుతాన్ని నేను కోల్పోయిన సమయాల్లో నన్ను క్షమించు. మీ ఆత్మ యొక్క బహుమతి అద్భుతమైన మరియు వినయపూర్వకమైన దయ. మరోసారి, తండ్రీ, మీ దేవాలయంగా నిన్ను సంతోషపెట్టడానికి మరియు గౌరవించటానికి నా శరీరాన్ని సజీవ త్యాగంగా సమర్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదే సమయంలో, మీ పవిత్ర బిడ్డగా మిమ్మల్ని సంతోషపెట్టడానికి మరియు గౌరవించటానికి మీ పరిశుద్ధాత్మ యొక్క ఉనికి మరియు శక్తి నాకు అవసరమని నేను అంగీకరిస్తున్నాను. నన్ను నడిపించండి, నన్ను శుభ్రపరచండి, నన్ను శుద్ధి చేయండి మరియు మీ ఆత్మ ద్వారా నన్ను యేసు లాగా చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు