ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

క్రొత్తనిబంధన అంతటా నీరు మరియు ఆత్మ - అనేవి మారుమనస్సు మరియు నూతనజన్మలో కీలకమైన భాగాలుగా కలిసి ఉంటాయి.(అపో.కా 2:38-41; 1 కొరింథీయులు 6:9-11; తీతు 3:3-7). ఒకటి సమర్పణ మరియు విధేయతతో కూడిన చర్య. మరొకటి, పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల్లోకి కురిపించబడిన తన శక్తి ద్వారా దేవుడు మాత్రమే మనలను క్రొత్తగా చేయగలడని బహుమతి మరియు గురుతు . ఈ రెంటిలో ఏవి కూడా మనం సొంతంగా సాధించగలిగేవి కూడా కాదు. కాబట్టి, యేసు మరియు యోహాను ఈ రెండు కృపా కార్యములను ఒక కొత్త జన్మ సంఘటనగా అనగా "నీరు మరియు ఆత్మ నుండి జన్మించారు."అను వ్యాకరణపరంగా అనుసంధానించారు. యేసు తన రాజ్యములోకి ప్రవేశించడానికి వాటిని కీలకం చేయడంలో ఆశ్చర్యం లేదు: మనం ఆయన విశ్వాసానికి మనలను అర్పించుకుంటాము మరియు ఆత్మ మనకు దేవుని కుటుంబంలో కొత్త జన్మనిస్తుంది

నా ప్రార్థన

పరిశుద్ధుడు, నీతిగల తండ్రి.నా యొక్క అత్యుత్తమ ప్రయత్నాలు విఫలం కావడం మరియు నా నిలకడ ఎల్లప్పుడూ స్థిరముగా లేదని నేను ధృవీకరిస్తున్నాను. మీరు యేసు లో మీ కృపను ఇచ్చి మరియు నన్ను మీ కుటుంబము లోకి నా ఆత్మీయ జననం ద్వారా నూతన పరిచినందుకు కృతజ్ఞతలు.యేసు నామమున నేను ప్రార్ధిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు