ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు ఉదాహరణ వెలుపల, ఈ ఆజ్ఞ అస్సలు అర్ధం లేనిదిగా ఉంటుంది . కానీ, మన విధిని మన సృష్టికర్త మరియు తండ్రి చేతిలో వదిలేయడం యొక్క ప్రాముఖ్యతను యేసు మనకు చూపిస్తాడు. అకస్మాత్తుగా అప్పుడు ఇది ఖచ్చితమైన అర్ధాన్ని ఇస్తుంది . శత్రువును ఓడించడానికి ఉత్తమ మార్గం ఏమిటి? ఖచ్చితంగా అది ఆ వ్యక్తిని కొట్టడం లేదా చంపడం వంటివి చేయదు . లేదు, మన శత్రువులను ఓడించే మార్గం యేసు దయతో వారి హృదయాలను బంధించడం మరియు వారి వ్యక్తిత్వం మన రాజుకు లోబడేవిధముగా చేయడం!

నా ప్రార్థన

ప్రేమగల మరియు దయగల దేవుడా, దయచేసి నా హృదయాన్ని మృదువుగా చేసి, నా దృడనిశ్చయాన్ని కఠినతరం చేయండి, తద్వారా యేసు ప్రేమించినట్లు నేను ప్రేమించగలను. నన్ను వ్యతిరేకించే, అసహ్యించుకునే, ఎగతాళి చేసే, నన్ను ద్వేషించేవారికి కూడా నా జీవితాన్ని వారికీ విముక్తి గా చేయండి . ప్రియమైన తండ్రీ, యేసు కృపకు ఇతరులను తీసుకురావడానికి నన్ను ఉపయోగించండి. ఆయన నామమున నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు