ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నిత్యజీవము ఇప్పుడు మొదలవుతుంది ! ఇది యోహాను సువార్తలోని యేసు సందేశాలలో ఒకటి. ఖచ్చితంగా, మనము తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు మనకై ఎదురుచూసే ఆశీర్వాదాలన్నింటినీ ఆస్వాదించలేము. కానీ, యేసు మనము ఆయన ప్రేమను తెలుసుకొని దానిని అనుభవించాలని , తండ్రి ప్రత్యక్షతను మన జీవితాల్లో తెలుసుకోవాలని, కోరుకుంటున్నాడు .అతను మనకోసం ప్రార్థించాడు! కాబట్టి తండ్రిని వెతుకుదాం - అతని గురించి తెలుసుకోవడమే కాదు, ఆయనను తెలుసుకోవాలి! మనము ఆయన దగ్గరకు రావాలని ప్రయత్నము చేసినప్పుడు అతను మన దగ్గరికి రావటానికి ఎదురుచూస్తున్నాడు! అతను మనలో పనిచేయుచున్నాడు, కాబట్టి అసలు సమస్య అతను మన సమీపముగా ఉండుటను గూర్చి కాదు కానీ, అతని ప్రత్యక్షత మరియు పనిని గురించి మనకు అవగాహన లేకపోవడమే. మన తండ్రి వైపుకు మన కళ్ళు మరియు హృదయాలను తెరిచి, ఆయన ప్రత్యక్షతను మనకు వెల్లడించమని ఆయనను కోరండి!

నా ప్రార్థన

పరలోకపు తండ్రీ, సర్వశక్తిమంతుడు మరియు పరిశుద్ధ దేవుడైన నిన్ను సంప్రదించడానికి నన్ను అనుమతించడం నన్ను ఆశ్చర్యపరుస్తుంది. నా జీవితంలో పని చేస్తాననిన మీ వాగ్దానంతో నన్ను నేను తగ్గించుకొనుచున్నాను . మీ ప్రత్యక్షతను మరియు దయను నేను అంగీకరించని విధంగా నా పై నేను ఆధారపడిన సమయాలను బట్టి నన్ను క్షమించు. మీ దైవిక సంరక్షణ గురించి మరియు మీ ఆత్మ ద్వారా నాలో మీ రోజువారీ ప్రత్యక్షత గురించి నాకు మరింత అవగాహన కలిగించండి. యెహోవా, నేను నిన్ను మరింత పూర్తిగా తెలుసుకొనగలుగునట్లు నా కళ్ళు మరియు హృదయాన్ని తెరవండి. యేసు పేరిట ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు