ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన వ్యక్తిత్వము యొక్క నిజమైన కొలత ఏమిటి? ఖచ్చితంగా ఇది "సంఘములో " మనం ఎలా వ్యవహరించుచున్నామో అనే దానిపై ఆధారపడదు. మన వ్యక్తిత్వము యొక్క నిజమైన పరీక్ష, మన దైవభక్తి, తప్పిపోయిన వారికీ , నిర్లక్ష్యము చేయబడినవారికి, అణగారిన మరియు విరిగిన వారిని విమోచించే పనిలో పరలోకమందున్న తండ్రితో మన భాగస్వామ్యథ్ నిజమైన కొలత . మనం మనకోసం మాత్రమే జీవించినప్పుడు, "బీదలను "వెనుకనే వదిలిపెట్టినప్పుడు, ఒక సంస్కృతి దానికదే కుప్పకూలిపోతుంది ఎందుకంటే అలా చెయడములో దేవుని హృదయం లేదు, మరియు ప్రజలు ఒకరిపైఒకరు అసూయపడతారు మరియు ఆగ్రహం చెందుతారు.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడు మరియు ప్రేమగల సార్వభౌమ ప్రభువైన దేవా, దయచేసి మమ్మల్ని క్షమించి, మా భూమిని బాగు చేయడానికి మీ పిల్లలను ఉపయోగించుకోండి. తండ్రీ, సంక్షోభ సమయాల్లో అతను లేదా ఆమెకు సహాయము చేయడానికి ఎవరు లేనప్పుడు వారికీ ఆశీర్వాదముగా ఉండునట్లు నన్ను మీరు నన్ను ఉపయోగించుకోవాలని నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు