ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

చాలా హృదయాలు, ఆశలు మరియు గృహాలు పాపంతో విచ్చిన్నమైపోయాయి . ఈ విచ్ఛిన్నత మన సంస్కృతికి సోకుతుంది మరియు మన జీవితాలపై దాడి చేస్తుంది. దేవుడు పాపానికి నిరోధకం మరియు దాని అపరాధానికి క్షమించే సాధనం రెండింటినీ అందించాడు అదే : మన నిజాయితీగా మరియు నిజముగా మన పాపాలను ఒప్పుకోవడము . ఒప్పుకోలు యొక్క హృదయంలో పాపం దేవుని దృష్టితో చూడడము చూడటం మరియు దానిలో మన పాల్గొనడమును బట్టి వేదన పొందడం. ఒప్పుకోలు అనేది అంత స్వస్థత పొందడం వంటిది అనుటలో ఆశ్చర్యం లేదు ( 1 యోహాను 1: 5-2: 2 కూడా చూడండి ). మన పాపాన్ని ఒకరినొకరు ఒప్పుకొని, పాపం నుండి ఒకరినొకరు నయం చేసుకోవడం మరియు దాని నష్టం కోసం ఆయన వద్దకు రావాలని దేవుడు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఒప్పుకోవటానికి దారితీసిన ఒక నీతిమంతుడి ప్రార్థనకు దేవుడు అలాంటి శక్తిని ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. మన పాపాన్ని ఒప్పుకొని దానిని వదిలివేద్దాం.

నా ప్రార్థన

ఓ ప్రియమైన తండ్రీ, పవిత్రత మరియు దయగల దేవా , దయచేసి నా పాపానికి నన్ను క్షమించు ... (మీరు దేవుని ముందు ఒప్పుకోవలసిన నిర్దిష్ట పాపాలను జాబితా తయారు చేయండి). ప్రియమైన తండ్రీ, దయచేసి మీ పిల్లల సమూహానికి నన్ను నడిపించండి, వారితో నేను పాప భారాన్ని దించుకొనెదను మరియు వారు నా క్షమాపణ కోసం ప్రార్థిస్తారని నా జీవితంలో పాపాన్ని అధిగమించడానికి మీ ఆత్మ నాకు సహాయం చేయునట్లు మీ దయ యొక్క శక్తి మరియు మీ ఆత్మ శక్తి పట్ల గొప్ప విశ్వమునకు నన్ను నడిపిస్తారని తెలుసుకోగలను . యేసు నామంలో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు