ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీరు యవ్వనులుగా వున్నప్పుడు ఇతరులు మిమ్మును గౌరవించాలని ఎలా ఆదేశిస్తారు? మీరు అలా చేయరు! మీరు మీ జీవితంలోని వ్యక్తిత్వము మరియు నాణ్యత ద్వారా ఆ గౌరవాన్ని సంపాదిస్తారు. మనలో పెద్దవాళ్ళు మంచి వ్యక్తిత్వము మరియు విశ్వాసం ఉన్న యువ క్రైస్తవులను గుర్తించి ధృవీకరించాలి. మనలో యవ్వనులు , ఇతరులు ప్రశ్నించలేని విధముగా వ్యక్తిత్వపు జీవితాన్ని గడపాలి. వ్యక్తిత్వము, నైతికత, విశ్వాసం మరియు దయగల ప్రేమ అనేవి క్రైస్తవుడి వయస్సుతో సంబంధం లేకుండా ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు.

నా ప్రార్థన

పరిశుద్ధ దేవా, మా సంఘ కుటుంబంలో యవ్వనులైన మరియు మీ వ్యక్తిత్వము కోసం నిలబడిన మరియు వారి తోటివారి ఒత్తిడి వారిపై ఉన్నను దైవిక జీవితాలను గడిపిన వారిని బట్టి నీకు కృతజ్ఞతలు. తండ్రీ, నా బహుమతులను ఉపయోగించుకునే అవకాశం కల్పించిన మరియు నా ఆధ్యాత్మిక వృద్ధిలో నన్ను ప్రభావితం చేసిన మరియు విశ్వాసంలో ప్రోత్సహించిన పెద్దవారిని బట్టి కూడా మీకు నా కృతజ్ఞతలు. దయచేసి మా సంఘమును మరియు వివిధ వయసుల వారు , మీ కీర్తికి మరియు మీ రాజ్యం యొక్క అభివృద్ధికి పూనుకునేవారుగా చేయుటలో￰ మరియు ఉద్దేశ్యంలో ఐక్యంగా ఉంచడంలో మాకు సహాయపడండి. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు