ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

అంత్యదినములలో నివసిస్తున్నవారిలా , ప్రతి విశ్వాసి - యవ్వన మరియు వృద్ద,మగ మరియు ఆడ - యేసు క్రీస్తులో దేవుని దయను గూర్చి తన వ్యక్తిగత సాక్ష్యాలను ఇవ్వడానికి ఆత్మ-నడిపింపులో మరియు ఆత్మ-శక్తితో నిండినవారై ఉండాలి. యేసు తన మరణానికి ముందు మనకోసం ప్రార్థించినట్లుగా (యోహాను 17: 20-23), దేవుడు తన కుమారుడిని లోక రక్షకుడిగా పంపాడని ప్రపంచం నిజంగా తెలుసుకోవాలంటే లింగ అడ్డంకులు మరియు వయస్సు అడ్డంకులు మరియు జాతి అడ్డంకులను దాటి మనం ఐక్యంగా ఉండాలి.

నా ప్రార్థన

సర్వ దేశములకు దేవా, దయచేసి మమ్మల్ని విభజించే మరియు మీ దయ యొక్క అద్భుతమైన సందేశాన్ని మందగింపచేసే అడ్డంకులను విచ్ఛిన్నం చేయండి . మీ ఆత్మను మాపై పోయండి మరియు మా పక్షపాతం మరియు స్వార్థం గురించి మమ్మల్ని దోషులుగా నిర్ధారించండి మరియు దానిని మీ అధికమైన ప్రేమతో భర్తీ చేయండి. యేసును ప్రభువు మరియు రక్షకుడిగా ప్రకటిస్తున్న ఐక్య సంఘమును చూస్తున్న లోకమునకు, నా స్వంత స్వల్ప దృష్టి మరియు స్వార్థము, అంతరాయం కలిగించినప్పుడు మమ్మల్ని క్షమించు, నన్ను క్షమించు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు