ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనలో చాలా ఉన్నత స్థితికి చేరినవారమైన మనము మరియు అన్నిటిని సానుకూలమైనవిగా చూసే మనము కూడా మనము మన జీవితంలో ఏదో ఒక సమయంలో మనకు మనము విరిగిపోయినట్లు మరియు అలసిపోయినట్లు కనిపిస్తాము. మనం గ్రద్దల రెక్కలపై ఎగిరిపోతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు మరియు దేవునితో మన నడకలో అలసిపోనప్పుడు యేసును నమ్మడం మరియు అనుసరించడం అంత కష్టం మేమి కాదు. సొమ్మసిల్లిపోకుండా మనం ఒక అడుగు తరువాత ఇంకో అడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తరచుగా మన విశ్వాసాన్ని ఉత్సాహంగా ఉంచడము చాలా కష్టతరమైన విషయం . సంపూర్ణ శక్తిహీనత, బలహీనత మరియు విచ్ఛిన్నత యొక్క ఆ క్షణాలలో, ప్రభువు చాలా నిజమైనవాడు, అత్యంత శక్తివంతమైనవాడు మరియు మనుకు అందుబాటులో వున్నవాడు.

నా ప్రార్థన

దేవా, దుష్టత్వము వలన నేను దాడికి గురైనప్పుడు మరియు జీవిత సవాళ్లు మరియు కష్టాలతో అలసిపోయినప్పుడు నన్ను నిలబెట్టి, నా విశ్వాసాన్ని సజీవంగా ఉంచినందుకు ధన్యవాదాలు. దయచేసి నేను ఇష్టపడేవారికి మరియు ఎవరి పేరునైతే నేను జ్ఞాపకము చేస్తున్నానో వారికి వారు అలసిపోయినను మరియు బలహీనంగా ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళటానికి బలమును ఇవ్వండి . దయచేసి వారి జీవితాల్లో మీరు నిజముగానే ఉండండి మరియు మీరు వారి గొప్ప విమోచకుడిగా సహాయం మరియు విమోచన కొరకు దయతో వస్తున్నారని వారికి తెలియజేయండి. యేసు నామంలో నేను అడుగుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు