ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పిల్లలు పెద్దగా గౌరవించబడని కాలంలో పిల్లల పట్ల యేసు చూపిన ప్రేమ ఒక శక్తివంతమైన జ్ఞాపిక . లోకం తరచుగా దుర్వినియోగం చేసే లేదా విడిచిపెట్టే వాటి పట్ల దేవుని ప్రేమను ఇది గుర్తు చేస్తుంది. మనం ప్రేమించబడని, మరచిపోయిన, దుర్వినియోగం చేయబడిన మరియు నిర్లక్ష్యం చేయబడిన వారిని ప్రేమించడానికి పిలువబడ్డాము. ఎందుకు? ఎందుకంటే ఐగుప్తులో ఇశ్రాయేలులు ఉన్నది మరియు కల్వరిలో యేసు అలాగే గుర్తింపులేనివారిగా వున్నారు మరియు అదే విధముగా మనము కూడా కృప లేకుండా ఉన్నాము (రోమా ​​5:6-11). రక్షణను తెలుసుకున్నామని మరియు ఆ దయ అవసరమైన ఇతరులతో పంచుకోకుండా ఆ రక్షణను గురించి ఎలా చెప్పగలం!? మనం యేసు శిష్యులమని ఎలా చెప్పుకోగలం మరియు ప్రపంచం మరచిపోయే వారిపట్ల ప్రేమ చూపకుండా ఎలా ఉండగలం?

నా ప్రార్థన

తండ్రీ, నేను మీలాంటి తల్లిదండ్రులుగా ఉండాలనుకుంటున్నాను — నా స్వంత పిల్లలకు పవిత్రమైన మరియు ప్రేమగల తల్లిదండ్రులుగా మరియు నేటి మరచిపోయిన పిల్లలకు అపురూమైన తల్లిదండ్రులుగా ఉండాలనుకుంటున్నాను. నా ప్రపంచంలో పిల్లలు బాధపడే నిర్లక్ష్యము మరియు వేధింపుల వల్ల ఉద్రేకపడటమే కాకుండా, వారిని ఆశీర్వదించే మార్గాల్లో ప్రవర్తించేలా ప్రేరేపించడానికి నాకు సహాయం చేయండి. పిల్లలందరికీ గొప్ప ప్రేమికుడైన యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు