ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నీటి ప్రవాహాలు - చనిపోతున్న ఆశలకు జీవన నీరు, పొడిగా ఉన్న హృదయాలకు చల్లని నీరు, అలసిపోయిన మరియు ￰సొమ్మసిల్లిన వారికి అది సేదతీర్చు తాజా నీరు .ఇది మన పెదవులతో త్రాగగల ద్రవము కన్నా చాలా ఎక్కువైనది . ఇది దేవుడు మనకు, తన పిల్లలకు ఇవ్వాలని కోరుకునే ఆత్మ యొక్క అత్యుత్తమ నీరు. యేసు వాగ్దానాలతో మనల్నిమనము నూతన ఉత్సహముతో ఉత్తేజ పరుచుకుంటూ మరియు మనం ఆయనకు దగ్గరవుతున్నప్పుడు,ఆయన ఆత్మ మన ఆత్మను పునరుద్ధరిస్తుందని నమ్ముతూ ఆగష్టు నెలను గడుపుదాము.

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, నన్ను రక్షించడానికి మరియు నన్ను నిలబెట్టడానికి మరియు పునరుద్ధరించడానికి పరిశుద్ధాత్మను, నన్ను రక్షించడానికి యేసును పంపినందుకు ధన్యవాదాలు. నా రక్షకుడి దగ్గరికి చేరుకోవడానికి మరియు మీ పరిశుద్ధాత్మ యొక్క సేదతీర్చు జీవజలముతో నా ఆత్మను పునరుద్ధరించడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు దయచేసి నన్ను ఆశీర్వదించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు