ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము అలసిపోయినప్పుడు, క్షీణించినప్పుడు మరియు కాల్చబడుచున్న దాని అంచున ఉన్నప్పుడు, మన ఆత్మలు పునరుద్ధరించబడాలి! కానీ మన ఆత్మలను ఎవరు పునరుద్ధరించగలరు? నిశ్చల జలాల పక్కన మనలను నడిపించేవాడు మాత్రమే! ప్రభువు మా గొర్రెల కాపరి ఆయన మాత్రమే మనకు అవసరమైన పోషణ మరియు తిరిగి మనలను నింపగలడు. కొన్నిసార్లు సమయాన్ని కేటాయించడం ఇంకా ఎందుకు మనకు కష్టమవుతుంది? మనం చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని కోల్పోవుటకు కారణము మనము మన జీవితాలను బిజీగా వుంచుకోవటమేనా?.

నా ప్రార్థన

మీరు నాకు మరల మరల చూపించిన ప్రకారం , ప్రియమైన తండ్రి, నేను మీ తో ఉండటం ,నా గుండె లోపల ఎవరూ చేరుకోలేని ఒక స్థానంలోకి తిరిగి నన్ను చేరుస్తుంది నాకు తెలుసు.అపరిశుద్ధమైన, అసహాయమైన ప్రదేశాల నుండి పోషణ, నూతనోత్తేజాన్ని కోరుకున్నందుకు నన్ను క్షమించు. మీ ఉనికిని, శక్తితో నన్ను తిరిగి చైతన్యవంతం చేయండి తద్వారా నేను మీకు మరింత విజయవంతంగా సేవలందించగలను. యేసు నామమున నేను ప్రార్ధిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు