ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీరు ఎప్పుడైనా చివరిగా ఎన్నుకోబడ్డారా? మీ బృందంలో ఎవరూ కోరుకోని వారుగా మీరు ఎప్పుడైనా ఉన్నారా? యేసుక్రీస్తులో దేవుడు మనలను ఎన్నుకోవడం విశేషం కాదా! యుగములకు రాజు మరియు అతని కుమారుడు యేసుక్రీస్తు మనల్ని ప్రేమించడం మరియు కోరుకోవడం ఆశ్చర్యకరం కదా! అంతే కాదు, మనల్ని జాలితో ఎంపిక చేయలేదు, కానీ ఒక మార్పు చేయడానికి ఎంచుకున్నాడు . స్థిరముగా ఉండే ఫలాలను అందించడానికి మరియు అవి నిత్యము ఫలించడానికైన నిరీక్షణ కొరకు సహాయపడటానికి, యేసు తన రాజ్యం కోరకు మనం చేసే పనిపై దేవుని ఆశీర్వాదం అడగవచ్చని మరియు మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. అసాధారణమైన విషయం!.

నా ప్రార్థన

ఓ దేవుడా, నీ పనికి తెరవబడిన హృదయాన్ని మరియు నీ దయ వలె విస్తారమైన దృష్టిని నాకు ఇవ్వండి. నా ప్రార్ధనలు మీకు మహిమను తెచ్చే, మీ రాజ్యం యొక్క సరిహద్దులను విస్తరించే విషయాల కోసం అడగనివ్వండి మరియు తరచుగా నన్ను పరధ్యానం చేసే పరిమిత విషయాలకు మించి నా వద్దకు చేరుకోండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు