ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం చేసే పనులను ఎందుకు చేయాలి? మన ప్రవర్తనకు ప్రేరణ ఏమిటి? ఇతరులకు మంచిగా కనిపించడం కోసం మనము మతపరమైన ఉచ్చులో పడటము చాల సులభము. సంస్కృతి మన విశ్వాసము పట్ల ప్రతికూలంగా స్పందించినప్పుడు కూడా ఇది నిజం. మన విశ్వాసం గురించి తెలిసినవారు మరియు మన చుట్టూ ఉన్న క్రైస్తవులు మన ప్రవర్తనకు లక్ష్యంగా మారతారు. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై సరైన ప్రభావాన్ని చూపాలని మేము కోరుకుంటున్నాము, ఇతరులు మనలను చూడాలని దానివల్ల వారు మనలను గౌరవించాలని ఆధ్యాత్మిక సేవ గురించి మన నిర్ణయాలు ఎప్పటికీ తీసుకోకూడదు . మన లక్ష్యం దేవుణ్ణి గౌరవించడం మరియు ఇతరులను ఆశీర్వదించడం అయియుండాలి.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, దయచేసి ఏదైనా తప్పుడు ప్రేరణ నా హృదయములో ఉంటే దానిని శుద్ధి చేయండి మరియు ఇతరుల అవసరాన్ని బట్టి మరియు వారికి సహాయం చేయడంలో మిమ్మల్ని గౌరవించాలనే నా కోరిక ఆధారంగా ఇతరులకు సేవ చేయడంలో నాకు సహాయపడండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు