ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

అధికముగా, వెంట్రుకలను నిక్కపొడిచే మరియు నిరుత్సాహపరిచే విధముగా వున్నా యిర్మీయా ప్రవచనాలలో, దేవుడు తన ప్రజలకు వారి మొండి పట్టుదలగల మరియు కఠినమైన హృదయాలను బట్టి వారిని నాశనం చేస్తానని పదేపదే చెప్పాడు. అయినప్పటికీ, ఈ శక్తివంతమైన మరియు మండుతున్న హెచ్చరికల మధ్యలో, దేవుడు ఆశతో మరియు దయతో కూడిన భాగాలను కూడా జారివిడిచాడు . "అలసిపోయినవారిని సేదతీర్చడము చేయండి మరియు మూర్ఛపోయినవారిని సంతృప్తి పరచండి" అనే దేవుని వాగ్దానం కంటే భరోసా కలిగించే మరి దేని గూర్చి అయినా మీరు ఆలోచించగలరా? డెబ్బై సంవత్సరాలు, ఇజ్రాయెలులకు దేవుని వాగ్దానము అదే . కానీ సమయం వచ్చినప్పుడు, దేవుడు తన మాటను బట్టి మంచి చేసాడు. ఈ రోజు అతను మాతో కూడా అదే చేస్తాడని నేను నమ్ముతున్నాను!

నా ప్రార్థన

గొప్ప కాపరి , నేను అలసిపోయాను మరియు సోలసిపోయాను. దయచేసి నా ఆత్మ మరియు నా శరీరానికి సేదతీర్చండి . దయచేసి మీరు ఇప్పటికే నాతో చాలా దయతో పంచుకున్న సమృద్ధిలో సంతృప్తి పొందడంలో నాకు సహాయపడండి. మీకే సమస్త కీర్తి మరియు ఘనత లభించుగాక . నేను సంతోషంగా విశ్వాసంతో నన్ను నేను సమర్పించుకున్నాను , మీరు వాగ్దానం చేసిన మిగిలిన సంతృప్తి కోసం నేను ఎదురు చూస్తున్నాను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు